గౌతమ్ ఆదానీకి సెబీ క్లీన్ చిట్
NEWS Sep 18,2025 08:55 pm
సెబీ కీలక ప్రకటన చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఖుష్ కబర్ చెప్పింది. హిండెన్ బర్గ్ ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. స్టాక్ మార్కెట్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందంటూ అమెరికా షార్ట్ సెల్లార్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధన ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది సెబీ.