రూ.7లక్షలతో మర్దగూడలో అభివృద్ధి పనులు
NEWS Sep 18,2025 08:57 pm
అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ మర్దగుడ గ్రామంలో స్థానిక సర్పంచ్ కొర్ర సింహద్రి అధ్యక్షతన జడ్పీటీసీ దిశరి గంగరాజు,ఎంపీపీ శెట్టి నీలవేణిలతో కలిసి రూ. 7లక్షల జడ్పీ నిధులతో సీసీ రోడ్డు,డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ జెడ్పీటీసీగా గెలిచిన తరువాత మండలంలో సుమారు రూ.1.కోటి 50 లక్షల రూపాయలు నిధులు తీసుకు రావడం జరిగిందని తెలిపారు. మండలంలో అనేక పంచాయతీ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొస్తామన్నారు.