నర్సింగాపూర్ లో విద్యార్థినులకు వైద్య పరీక్షలు
NEWS Sep 18,2025 08:57 pm
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కరమైన మహిళా సాధికారత కుటుంబ ప్రచార కార్యక్రమంలో భాగంగా నర్సింగాపూర్ గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుతోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ బాలికలలో రక్తహీనత సమస్య లేకుండా ఆరోగ్య పరిరక్షణ ఉండాలన్నారు.