రాయలసీమ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
NEWS Sep 18,2025 08:58 pm
రాబోయే రెండు రోజులు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, అన్నమయ్య, కడప, తిరుపతి (పశ్చిమ), అనంతపురం (తూర్పు), సత్యసాయి (తూర్పు) జిల్లాల్లో రాత్రి వడగళ్ల వర్షాలు పడే అవకాశముంది. కర్నూలు, నంద్యాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ హెచ్చరించింది.