సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకుల కృషి
NEWS Sep 24,2025 07:02 pm
బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామపంచాయతీ పరిధిలోని 13వ వార్డులో టీడీపీ టౌన్ అధ్యక్షులు దొండా నరేష్ పర్యటించారు. వార్డులో ఉన్న కాల్వల్లో మట్టి, తుప్పలు, వీధి దీపాలు, కుళాయిల సమస్యలను గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.