సిరిసిల్ల కలెక్టర్ కు సర్కార్ నోటీసులు
NEWS Sep 18,2025 06:41 pm
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ ఉల్లంఘించిన సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేశారు.సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ ను అదేశించారు. తను ఇచ్చే వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.