లిక్కర్ స్కాంపై మంత్రి కీలక కామెంట్స్
NEWS Sep 18,2025 02:56 pm
ఏపీ లిక్కర్ స్కామ్ పై శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. విచారణ తర్వాత అన్నీ బయటకు వస్తాయని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం బూమ్ బూమ్ అని ఏవేవో బ్రాండ్లు పెట్టి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరి చేస్తున్నామని తెలిపారు.