రాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లా వాసుల కల
NEWS Sep 18,2025 12:55 pm
ఉపాధి అవకాశాలు పెంచాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్య ప్రసాద్. పని కోసం వలసలు వెళ్లే పరిస్థితి రాకూడదన్నారు. పరిశ్రమల వల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు. రామాయపట్నం పోర్టు అనేది ప్రకాశం జిల్లా వాసుల కల అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము ముందుకు వెళుతున్నామని, వైసీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.