శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత
NEWS Sep 18,2025 11:38 am
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి కిందకు నీళ్లను వదిలారు. ఇన్ ఫ్లో 1,68,129 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1,77,431 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.9198 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతోంది విద్యుత్ ఉత్పత్తి.