రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.... మరొకరికి గాయాలు
NEWS Sep 18,2025 03:57 pm
కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం వద్ద కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో మణుగూరుకు చెందిన పాల్వంచ సురేష్ మృతి చెందగా, ఆయన మేనకోడలు అంజలికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాను పోలీసులు పరిశీలిస్తున్నారు. కారు వేగంగా ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు మాట్లాడుకుంటున్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.