కొత్తగా 8,57,966 ఇళ్లకు నల్లా కనెక్షన్లు
NEWS Sep 18,2025 10:52 am
రాబోయే రెండు మూడేళ్లలో మున్సిపాల్టీల్లో కొత్తగా 8,57,966 ఇళ్లకు తాగు నీటి కొళాయి కనెక్షన్లు అందిస్తామని వెల్లడించారు మంత్రి నారాయణ. కేంద్రం పలు పథకాల ద్వారా నిధులు విడుదల చేసినా గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వ లేదన్నారు. దీంతో మున్సిపాల్టీల్లో పనులు మధ్యలో నిలిచి పోయాయని ఆరోపించారు. అమృత్ 2.0, ఏఐఐబీ, అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంల ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.