విద్యుత్ భారం పడకుండా చూస్తాం
NEWS Sep 18,2025 10:36 am
ఎస్సీ, ఎస్టీ వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అర్హులైన వారికి ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తుందన్నారు. 2014-19 మధ్య కాలంలో 9 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని రాష్ట్రం సాధించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ వ్యవస్థను సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. 9 సార్లు చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిందన్నారు.