నా వల్లే కమ్యూనికేషన్ విప్లవం
NEWS Sep 18,2025 08:19 am
ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం అయిన కొత్తలో టెక్నాలజీ గురించి ఎవరికీ అర్థమయ్యేది కాదన్నారు. ఆ రోజుల్లో చాలా దేశాల్లో పర్యటించానని, అప్పట్లే మన కమ్యూనికేషన్ వ్యవస్థలు రెండే ఉండేవన్నారు. తాను మొబైల్ ఫోన్ గురించి మాట్లాడినప్పుడు విమర్శించారని, కానీ ఇప్పుడు అది జీవితంలో ఒక భాగంగా మారిందన్నారు. నా వల్లనే కమ్యూనికేషన్ విప్లవం మొదలైందన్నారు. ఈ క్రెడిట్ అంతా వాజ్ పేయికి ఇవ్వాలన్నారు.