8 ఏళ్ల తర్వాత దొరికిన నిందితుడు
NEWS Sep 26,2025 05:16 pm
కొత్తకోట/రావికమతం: గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన 4 కేసుల్లో నిందితుడు ఎనిమిదేళ్ల తర్వాత పోలీసుల చెరలోకి చిక్కాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు వివరాల ప్రకారం, కాకినాడకు చెందిన కొరపాకల కుమారస్వామి (33)పై 2017లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతను ఇటీవల హైదరాబాద్ భవానినగర్‌లోని పెట్రోల్ బంక్‌లో పనిచేస్తుండగా, పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.