ఉపాధ్యాయుల కొరతపై ఎమ్మెల్యేకు వినతి
NEWS Sep 17,2025 11:25 pm
JGTLలోని 11వ వార్డు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరని మాజీ కౌన్సిలర్ బాలే శంకర్ MLA సంజయ్ వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల బోధనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే కొత్త ఉపాధ్యాయుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించిన MLA సానుకూలంగా స్పందించి, చర్య తీసుకుంటామన్నారు.