ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
NEWS Sep 18,2025 07:51 am
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. భీమారం (M) ఒడ్డాడు లో జిర్డ్స్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం పోస్టర్ ను ఆవిష్కరించారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగడి ఆనంద్ కుమార్, బొమ్మెన ప్రశాంత్, చెక్కపల్లి సంజీవ్, స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.