మహిళలు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి : ఎమ్మెల్యే
NEWS Sep 18,2025 07:51 am
మహిళలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మాతా శిశు కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వస్థనారి స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషక విలువలపై కూడిన ఆహారం తీసుకోవాలని మహిళలకు సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.