సీసీ రోడ్ల నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యేకు వినతి
NEWS Sep 18,2025 07:53 am
JGTL రూరల్ మం. చలిగల్ గ్రామ డబుల్ బెడ్ రూమ్ కాలనీ ప్రజలు MLA సంజయ్ కుమార్ను వారి కార్యాలయంలో కలిశారు. కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. MLA సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ZPTC పెండెం రాములు, గౌడ సంఘం అధ్యక్షుడు అబ్బూరి మల్లేశం, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.