జగిత్యాల కలెక్టరేట్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
NEWS Sep 18,2025 07:54 am
జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బి ఎస్ లత లు నిరంజన్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా సాధించిన ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రసంగించారు.