రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
NEWS Sep 18,2025 07:54 am
జగిత్యాల పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంచినీళ్ల బావి చౌరస్తా నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ టవర్ సర్కిల్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద ముగిసింది. అనంతరం రాయల్ హాల్లో ప్రాంగణంలో వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.