జగిత్యాల కలెక్టరేట్ లో విశ్వకర్మ జయంతి వేడుకలు
NEWS Sep 18,2025 07:55 am
జగిత్యాల కలెక్టరేట్ లో విశ్వకర్మ జయంతి వేడుకలన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్ర పటానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీమంత్రి జీవన్ రెడ్డి తదితరులు పూలమాలలు వేశారు. సృష్టికర్త విశ్వకర్మ అని కొనియాడారు.కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాజా గౌడ్, బిఎస్ లత, బీసీ సంక్షేమ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.