జగిత్యాల పట్టణంలో 3 ఇళ్లలో చోరీ
NEWS Sep 17,2025 09:52 pm
జగిత్యాలలోని అయ్యప్ప దేవాలయం ఆనుకొని ఉన్న హరిహరన్ కాలనీలో వరుసగా తాళాలు వేసి ఉన్న 3 ఇళ్లలో చోరీ జరిగింది. మొత్తం 12 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. కాలనీలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. చోరీ జరిగిన ఇండ్లను టౌన్ సీఐ కరుణాకర్ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.