ప్రభుత్వ లక్ష్యం ప్రజల సంక్షేమం
NEWS Sep 18,2025 08:03 am
పేదవాడికి సంక్షేమం అభివృద్ధి జరగాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలం ఈ బయ్యారం శ్రీకృష్ణ దేవాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదవాళ్ళకి కూడుగూడు , విద్య వైద్యం అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఏజెండా అన్నారు. పేదవాళ్ళకి ఇల్లు, సన్నబియ్యం, ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్, విద్య వైద్యం అంటే అనేక సేవలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వంలో ఉందన్నారు.