కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
NEWS Sep 18,2025 08:04 am
పినపాక మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో భారీగా వివిధ పార్టీల నుండి చేరుతున్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం పర్యటన సందర్భంగా ఈ బయ్యారం గ్రామపంచాయతీ నుండి సుమారు 100 కుటుంబాలు, ఎల్సిరెడ్డి పల్లి నుంచి 80 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ పార్టీల కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే పాయం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుదామని ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ రాకుండా చేస్తామని తెలియజేశారు.