పార్టీ మారిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్న ఎమ్మెల్యే
NEWS Sep 17,2025 10:01 pm
జగిత్యాల: తాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు. అభివృద్ధి కోసం పార్టీలు మారానని చెప్పుకునే జగిత్యాల ఎమ్మెల్యే మకునూరు సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఏం చేశారు? ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించనందుకు ఆయన సిగ్గుపడాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.