టీఎల్‌ఎం మేళాలో ద్వితీయ బహుమతి సాధించిన ఉపాధ్యాయురాలు
NEWS Sep 17,2025 10:01 pm
ఇబ్రహీంపట్నం: జిల్లా స్థాయిలో జరిగిన టీఎల్‌ఎం మేళాలో అమ్మక్కపేట యూపీఎస్ ఉపాధ్యాయురాలు రాధిక ద్వితీయ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా యూపీఎస్ డబ్బా ప్రధానోపాధ్యాయుడు చిలుముల రాజేష్, సీనియర్ ఉపాధ్యాయుడు మండలోజ్ అశోక్ రాధికకు చిరు సన్మానం చేశారు. కార్యక్రమంలో అమ్మక్కపేట ప్రధానోపాధ్యాయుడు గంగుల జనార్దన్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, చిప్ప గంగన్న, వేముల నర్సయ్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.