జగిత్యాల: ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు
NEWS Sep 17,2025 09:56 pm
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సునీల్, నాయకులు రాజు, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.