చిట్వేల్ జడ్పీహెచ్ఎస్‌లో తప్పిన ముప్పు
NEWS Sep 17,2025 04:37 pm
చిట్వేల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్ద ప్రమాదం తప్పింది. పాఠశాల ప్రహరీ గోడలో ఒకభాగం ఆకస్మికంగా కూలిపోగా, అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. గోడ కూలిన శబ్దంతో ఉపాధ్యాయులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే గోడను మరమ్మతు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాఠశాల పిల్లల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచించారు.