పర్యాటక హబ్ గా ఏపీ : దుర్గేష్
NEWS Sep 11,2025 11:39 am
ఏపీని పర్యాటక హబ్ గా మారుస్తున్నామని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. కర్నూల్ జిల్లాలోని ఓర్వ కల్లు రాక్ గార్డెన్ ను పరిశీలించారు. సీఎం చంద్రబాబు సహకారంతో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ప్లాన్స్ కూడా తయారు చేశామన్నారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.