ఈవోను అభినందించిన టీటీడీ చైర్మన్
NEWS Sep 11,2025 09:46 am
టీటీడీ నూతన ఈవోగా కొలువు తీరారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్. ఆయన ఈవోగా రెండోసారి రావడం. టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మర్యాద పూర్వకంగా సింఘాల్ తిరుమల లోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ నాయుడును కలిశారు. ఈ సందర్బంగా తనను అభినందించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో కలిసి పని చేయాలని ఆకాంక్షించారు. ఈవోను శాలువాతో సత్కరించారు.