సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తన మాటలు వింటే అబద్దం కూడా ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. కత్తెర జేబులో పెట్టుకుని ఎక్కడ కనిపిస్తే అక్కడ రిబ్బన్లు కట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కట్టింది కేసీఆర్ అయితే కట్ చేస్తుంది నువ్వు అని తెలుసుకుంటే మంచిదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2052 కోట్లు ఖర్చు పెట్టి 2016 లో ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. కానీ నీలా మాత్రం ప్రచారం చేసుకోలేదన్నారు హరీశ్.