నువ్వంటేనే ప్రజలకు అసహ్యం
NEWS Aug 07,2025 09:00 am
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. నువ్వంటేనే ప్రజలు ఈసడించు కుంటున్నారని అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు. ముందు నీ భాషను మార్చు కోవాలని, సీఎం పదవిలో ఉన్నప్పుడు హుందాగా ఉండాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టి తిట్టి.. నీ తిట్లు వినలేక అసహ్యించు కుంటున్నారని మండిపడ్డారు. నువ్వుండేది మూడేళ్ల వరకే, సోషల్ , డిజిటల్ మీడియాతో గెలిచి వారినే తిడితే ఎలా అని ప్రశ్నించారు. సీమాంధ్ర కాంట్రాక్టర్ల పేర్లు, నీ బండారమంతా త్వరలోనే బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.