వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం
NEWS Jul 01,2026 09:12 pm
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో, వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. అయితే, వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేయడం వెనుక ఉన్న పూర్తి వివరాలు, తగిన భద్రతా ప్రమాణాలపై 3 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం మెటాను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.