డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ మంజూరు చేయండి
NEWS Aug 07,2025 08:56 am
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. హైదరాబాద్ లోని ఎల్‌బీ నగర్ నుండి హయత్ నగర్ మార్గంలో ప్రతి రోజు దాదాపుగా లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయని , ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించాలని సూచించారు. చింతలకుంట చెక్ పోస్ట్ నుండి హయత్ నగర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు సుమారు 5.5 కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడర్‌గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ప్రపోజల్స్ పంపిస్తే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు గడ్కరీ.