ధర్మస్థలలో విధులు నిర్వహిస్తున్న మీడియా మిత్రులపై దాడి జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నటుడు ప్రకాశ్ రాజ్. దీనిని పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి గూండాల వల్లే భక్తులు విశ్వసించే ధర్మస్థలకు కళంకం వస్తోందంటూ వాపోయారు. సౌజన్య దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే, వారు ఎందుకు కోపంగా ఉన్నారని ప్రశ్నించారు. నిందితులను అరెస్టు చేసి నిజం బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు.