ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి పక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. పెన్షన్ పెంపు హామీపై ప్రతిపక్షాలు మాట్లాడక పోవడం దారుణం అన్నారు. పక్క రాష్ట్రంలో హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ ఇస్తుంటే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 20 నెలలుగా గడిచిన హామీ అమలు కాలేదన్నారు.