రాత్రి అయితే మొరం దందా.. నిద్ర మబ్బులో అధికారులు..
NEWS Aug 06,2025 11:52 pm
మెట్ పల్లి పట్టణ శివారు, మండల పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి అనుమతి లేకుండా మొరాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దందా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా తవ్వి తీసిన మొరాన్ని ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా రాత్రి తరలిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.