ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానివ్వం అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నరేంద్ర మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేసే బాధ్యత మేము తీసుకుంటామని ప్రకటించారు సీఎం. జంతర్ మంతర్ సాక్షిగా శపథం వేసి చెప్తున్నానని అన్నారు.