దక్షిణాది రాష్ట్రాల సాహిత్యాన్ని ఒకే వేదికపై చేర్చే లక్ష్యంతో బెంగుళూరులో ఈ నెల 8, 9, 10 తేదీలలో జరిగే "బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్"కు తెలంగాణ (సిరిసిల్ల) రచయిత పెద్దింటి అశోక్ కుమార్ ఎంపికయ్యారు. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన అశోక్ కుమార్ ఇప్పటికే పలు జాతీయ సాహిత్య సదస్సులలో పాల్గొని తెలంగాణ సాహిత్య విభిన్న పార్శ్వాలను దేశవ్యాప్తంగా చర్చించారు. ఈసారి "తెలుగు సాహిత్యంలో ప్రాంతీయ అస్తిత్వం" అనే అంశంపై ఆ వేదికపై పెద్దింటి అశోక్ కుమార్ ప్రసంగిస్తారు.