ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీపై సీరియస్ కామెంట్స్ చేశారు. బీసీలకు ఆ పార్టీ వ్యతిరేకమన్నారు. అందుకే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బీసీల నోటి కాడ ముద్దను బీజేపీ గుంజుకునే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారో లేదో క్లారిటీగా చెప్ప లేదన్నారు. బండి సంజయ్ ఎందుకు ముస్లింల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు.