ఢిల్లీలో నూతనంగా నిర్మించిన కర్తవ్య భవన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కేంద్ర సచివాలయ నిర్మాణం చేపట్టారు. దీంతో కేంద్ర మంత్రిత్వ శాఖల చిరునామాలు మారనున్నాయి. కర్తవ్య పథ్ పక్కనే నిర్మించిన సచివాలయానికి కర్తవ్య భవన్ గా పేరు పెట్టారు. కొత్త సచివాలయంలో అన్ని శాఖల కార్యాలయాలు, కేంద్ర మంత్రుల ఛాంబర్లు ఉన్నాయి. తమ సర్కార్ సాధించిన ఘనతకు ఇది నిదర్శనమని అన్నారు పీఎం.