ఏపీ మంత్రివర్గం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో పాటు నూతన మద్యం పాలసీని కూడా ఆమోదించింది. మొత్తం 12 అంశాలపై విస్తృతంగా చర్చించింది. అనంతరం కేబినెట్ ఓకే చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళల ఆత్మ గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే మహిళా సంఘాలు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారని తెలిపారు.