ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డిపై. తన భాష దారుణంగా ఉందని, దానిని మార్చుకుంటే మంచిదన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందన్నారు. అయితే మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియదన్నారు.