యూటర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలి
NEWS Aug 06,2025 01:00 pm
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తమ హక్కు అని, సాధించుకుని తీరుతామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్రానికి కనువిప్పు కలిగేందుకే ఢిల్లీలో మహా ధర్నా చేపట్టడం జరిగిందన్నారు.అసెంబ్లీలో మద్దతు తెలిపిన రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలో మాత్రం యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఎవరి ఒత్తిడితో వెనక్కి తగ్గారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.