బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. 42 శాతం రిజర్వేషన్ తో ఉద్యోగస్థులు, విద్యార్థులకు లబ్ది చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో మాత్రం మోకాలు అడ్డుతోందని ఆరోపించారు. హైదరాబాద్ లో కాదు ఢిల్లీలో కవిత ధర్నా చేయాలన్నారు. బీజేపీని ఒప్పించేలా ఒత్తిడి తీసుకు రావాలని కోరారు.