కాంగ్రెస్ ఎమ్మెల్సీ , నటి విజయశాంతి కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించామని, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడి సాధిస్తామన్నారు.