ఆవును ఖననం చేసిన VHP నాయకులు
NEWS Aug 06,2025 01:47 pm
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో ఒక ఆవు బుధవారం ఫుడ్ పాయిజన్ తో మరణించింది. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ నాయకులు ఆవుకి హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఖననం చేశారు. దీనికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలో ఆవుల యజమానులు వాటిని రోడ్లపై వదిలేయవద్దని, ఇంటి వద్దనే పెంచుకోవాలని సూచించారు.