ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు మద్దతు ప్రకటించారు డీఎంకే ఎంపీ కనిమొళి. మన హక్కులను మనమే కాపాడు కోవాలన్నారు. పెరియార్ స్పూర్తితో రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తమదేనని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.