ఎల్వీ కామెంట్స్ టీటీడీ చైర్మన్ సీరియస్
NEWS Aug 06,2025 10:52 am
తిరుమలలో దర్శన విషయంపై టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం చేసిన కామెంట్స్ పై స్పందించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీని వాడుతున్నారని, దీనిని తిరుమలకు వాడితే తప్పేంటి అని ప్రశ్నించారు. ఎలాంటి అవగాహన లేకుండా టీటీడీపై బురద చల్లే ప్రయత్నం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ఇబ్బందులు పడకుండా గంట వ్యవధిలో దర్శనం కల్పించేందుకు ఏఐని ఉచితంగా ఇచ్చేందుకు గూగుల్, టీసీఎస్ ముందుకు వచ్చాయన్నారు.