రోజు రోజుకు బెట్టింగ్ యాప్స్ కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్. బెట్టింగ్ యాప్స్ వల్ల హైదరాబాద్ కు చెందిన నరేష్ సూసైడ్ చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ ను తక్షణమే నిషేధం విధించాలని, వాటిని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై చర్యలు తీసుకోవాలని , యువతను కాపాడాలని కోరారు . ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేశారు కేఏ పాల్.